Narendra Reddy | మంత్రి దామన్న సహకారంతో అభివృద్ధి చేస్తా

Narendra Reddy | మంత్రి దామన్న సహకారంతో అభివృద్ధి చేస్తా

డాకూర్ సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి


Narendra Reddy | సంగారెడ్డి ప్రతినిధి, జోగిపేట, ఆంధ్రప్రభ : మంత్రి దామన్న సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తానని డాకూర్ సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి (Narendra Reddy) అన్నారు. శనివారం మధ్యాహ్నం డాకుర్ లో ఆంధ్రప్రభ బ్రోచర్ ఆవిష్కరించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గ్రామాభివృద్ధి (Village development) కోసం మంత్రి సహకారంతో ఎన్ని నిధులైన తీసుకువచ్చేందుకు తాను సిద్ధమని ఆయన చెప్పారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్ (Ramesh Goud), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, మాజీ ఉప సర్పంచ్ అజయ్సం, జీవ్ పద్మారావు, యేసయ్య, శివయ్య, అరవింద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply