Narendra Modi | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీజేపీ వ్యవహారాలపై పెదవి విప్పారు. పార్టీలో ఏం జరుగుతున్నదో తనకు తెలుసునంటూ ఎంపీల ముందు తన మనోగతం వెల్లడించారు. దేశ వ్యాప్తంగా(across the country) బీజేపీ హవా కొనసా గుతుండగా… మొన్నటికి మొన్న బీహార్ ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించి అప్రతిహ తంగా నిలవగా, తెలంగాణలో బీజేపీ ఎందుకు ఇంతటి దీనావస్థలో(In a state of poverty) ఉంది అంటూ నిలదీశారు. ఒకే ఒక ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. 8మంది ఎంపీలతో పార్లమెంట్ లోనూ గణనీయమైన ప్రాతినిధ్యం ఉన్నది. అయినా పార్టీ తెలంగాణలో పుంజుకోవడం లేదు.. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంకా తెలంగాణలో వెనుకబడే ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Narendra Modi | తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడి ఉంది
గురువారం పార్లమెంట్లోని పీఎం ఆఫీసు ఛాంబర్లో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆల్పహార విందు(Breakfast dinner) ఇచ్చారు. తెలంగాణ, ఏపీ, కేరళ, అండమాన్ ఎంపీలు ఇందులో పాలుపంచుకున్నారు. దాదాపు ఆరగంటకు పైగా సమావేశమైన ప్రధాని, తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక మోస్తరులో క్లాస్(Class in moderation) తీసుకున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ తోపాటు ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నత పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చామని, కానీ అందుకు తగ్గట్టుగా వారి పని విధానం లేదని ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు ఉన్నా.. సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని వ్యాఖ్యా నించారు. అసలు తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడి ఉందని ఎంపీలను ప్రశ్నించారు. బీజేపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా.. వెనకబడటంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో మంచి టీమ్ ఉన్నప్పటికీ అవకాశాలను(opportunities) సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రధాని…

