Nandyala | అధికారులపై మరింత బాధ్యత పెరిగింది…

Nandyala | అధికారులపై మరింత బాధ్యత పెరిగింది…

  • జిల్లాలో 25 మంది ఉన్నతాధికారులకు.. 393 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు…

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాను ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో భాగంగా ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు చేరవేసే విధంగా ఉన్నతాధికారులు అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు వారిపై మరింత బాధ్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ లో పేర్కొన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాలు వేడుకల్లో భాగంగా నంద్యాల కళాశాల గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల త్యాగాలు మరువలేవని వారు పేర్కొన్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 25 మంది ఉన్నతాధికారులకు 393 మంది మండల రెవెన్యూ అగ్రికల్చర్ పోలీస్ విద్యాశాఖ ఆరోగ్య శాఖ హార్టికల్చర్ వెటర్నరీ మార్క్ ఫెడ్, సివిల్ సప్లై ఆఫీస్ హౌసింగ్ కార్పొరేషన్ స్టీల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కమర్షియల్ సాక్స్ డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పార్లమెంట్ కలెక్టర్ పిసిలో ఉన్న ఉద్యోగులకు జాయింట్ కలెక్టర్ పిసిలో ఉన్న ఉద్యోగులకు కలెక్టర్ సిబ్బందికి పి జి ఆర్ ఎస్ లో పనిచేసే ఉద్యోగులకు జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు డిఆర్డిఏ కార్యాలయం గ్రామ దేవాదాయశాఖ ఫైనాన్స్ ఫైట్ శాఖ శిక్ష తీసి ఫుడ్ అండ్ సేఫ్టీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టు టైగర్ డివిజన్ కార్పొరేషన్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలోనూ పనిచేస్తున్న సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో వినూత్నమైన ఆదర్శమైన సంక్షేమ పథకాలు సమర్థవంతంగా పనిచేసే సిబ్బంది మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వము చేపడుతున్న నూతన సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి ఉద్యోగస్తులు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి కూడా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రగతి నివేదికలో ఉన్న అంశాలను ప్రతి ఒక్క ఉద్యోగి అర్థం చేసుకోవాలని అందుకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.

ప్రశంసా పత్రాల అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు మండల స్థాయి గ్రామస్థాయి అధికారులు బాధ్యత తో వ్యవహరించాలన్నారు. ఈ కమాండేషన్ సర్టిఫికెట్ ఉత్తమ సేవలో అందించేందుకు గుర్తింపు ఇచ్చేందుకు ఇచ్చిన పత్రం గా పేర్కొన్నారు. సాగునీటి తాగు నీటి గ్రామాలతో పాటు రైతులకు అనుగుణంగా ఈ ప్రభుత్వము అనేక నూతన సంస్కరణలు చేపట్టిందన్నారు. రైతు భరోసా తల్లికి వందనం రైతు నేస్తం ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నిధుల అనుసంధానం తో పాటు జిల్లాలో రోడ్ల అభివృద్ధికి కల్వర్టుల నిర్మాణానికి కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేసిందన్నారు.

జిల్లాలో ఉపాధి కల్పన ద్వారా స్కిట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 60 జాబిలాలు నిర్వహించి 6వెల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రభుత్వం అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది అన్నరు. గ్రామ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నరు. ప్రభుత్వం ఇచ్చిన దీపం పథకం తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యువతకు ఉద్యోగాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు సంక్షేమం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ సుపరిపాలనలో తొలి అడుగుల్లో భాగంగా ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయానికి కొత్త శకం సోషల్ రీ ఇంజనీరింగ్ పలికారు సురక్షిత ఆంధ్ర ప్రదేశ్ కోసం మహిళా సంక్షేమం కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ప్రత్యేక పథకాలను రూపొందించారు.మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Leave a Reply