Nandyala | మారుతున్నరాజకీయ సమీకరణాలు..

Nandyala | మారుతున్నరాజకీయ సమీకరణాలు..

  • జనసేనలో భారీ ఎత్తున చేరికలకు రంగం సిద్ధం..
  • 100 వాహనాల్లో జన సైనికులు.. నాయకులు..

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి సమక్షంలో నంద్యాల పట్టణం జనసేన నాయకులు భవనాశి వాసు ఆధ్వర్యంలో నంద్యాల నుంచి వాహనాల్లో మంగళగిరికి తరలివెళ్లారు. దాదాపు వంద వాహనాల్లో తరలివెళ్లినట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖులు జన సేన పార్టీలో చేరుతున్నారన్న వార్తలు నంద్యాల పట్టణంలో చర్చనీయాంశమైంది.

Nandyala

పార్టీలో చేరిన అనంతరం నంద్యాలలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో జనసేన పార్టీకి కార్యకర్తలు ఉన్నప్పటికీ నాయకత్వం లోపం స్పష్టంగా ఉంది. దానిని నివారించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా నంద్యాల నుంచి భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరికలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వందల వాహనాల్లో మంగళగిరికి తరలి వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ.. నంద్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది.

Leave a Reply