Nandigama | అదుపుతప్పిన కోళ్ల వ్యాను..

Nandigama | అదుపుతప్పిన కోళ్ల వ్యాను..
Nandigama, నిజాంపేట, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నిజాంపేట (Nizampet) మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో తాత్కాలిక వంతెన వద్ద అదుపుతప్పి కోళ్ల వ్యాన్ కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ మేరకు వ్యాన్ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట (Siddipet) నుండి రామాయం పేటకు వెళ్తున్న కోళ్ల వ్యాన్ రోడ్డు బాగుందని స్పీడ్ గా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
భారీ వర్షాలకు కల్వర్టు కృంగిపోయి తాత్కాలిక కల్వర్టు ఏర్పాటు చేయడంతోనే నిత్యం వాహనదారులు రోడ్డు బాగుందనే ఉద్దేశంతో స్పీడ్ గా రావడం వల్ల అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లడం జరుగుతుందని డ్రైవర్ తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి కృంగిపోయిన కల్వర్టును తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు.
