Nampally | సిట్ విచారణకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన…

Nampally | సిట్ విచారణకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన…

Nampally | నాంపల్లి, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిట్ విచారణకు నిరసన నల్ల బ్యాడ్జీలతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ పై సిట్ విచారణ జరపడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిట్ విచారణ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిట్ విచారణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. టిఆర్ఎస్ నాయకులు నక్క రవీందర్, నాంపల్లి గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్, కామిశెట్టి పాండు, నాంపల్లి బిక్షం, గౌరీ కిరణ్, నాంపల్లి సంజీవ, దుబ్బ జనార్ధన్, బాల రామ్మూర్తి, బెల్ది సత్తయ్య, సర్దార్ నాయక్, గంజి సంజీవ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply