ఘనంగా నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు

జూలూరుపాడు, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో నామా నాగేశ్వరరావు జన్మదిన సందర్భంగా కేక్‌ను బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు యల్లంకీ సత్యనారాయణ కట్ చేశారు.

ఈ సందర్భంగా యల్లంకీ సత్యనారాయణ మాట్లాడుతూ ఖమ్మం ఎంపీగా, పార్లమెంట్‌లో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నామా నాగేశ్వరరావు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. నామా నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చాపలమడుగు రామ్మూర్తి, నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, రాయపాటి వెంకటేశ్వర్లు, తాళ్లూరి రామారావు, తాళ్లూరి నవీన్, పురస్తపురం రామకృష్ణ, ఇల్లంగి తిరుపతి, ఇస్రం రవి, మోదుగు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply