Nallabelli | నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ చొరవ

Nallabelli | నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ చొరవ

Nallabelli | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీతండా తండా వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి సమస్యను పరిష్కరించేందుకు నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ కేలోత్ రాజకుమార్ స్వయంగా చర్యలు చేపట్టారు. తండా వాసుల రోజువారీ నీటి కష్టాలు చూడలేక తన సొంత ఖర్చులతో బోరు వేయించారు. ఇప్పటికే బోరు పనులు పూర్తి చేసి, త్వరలోనే మోటరు ఏర్పాటు చేసి స్థిరమైన నీటి సరఫరా కల్పిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.

Leave a Reply