Nallabelli | కోతుల బెడద తగ్గించేందుకే..

Nallabelli | కోతుల బెడద తగ్గించేందుకే..
- కొండెంగను తీసుకొచ్చాం
- నారక్కపేటలో కోతులకు చెక్ – కొండెంగ ఎంట్రీ!
- కోతుల బెడదకు ‘కొండెంగ’ సవాల్
- ఉపసర్పంచ్ రాంబాబు
Nallabelli | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదను తగ్గించేందుకు వినూత్న చర్య చేపట్టినట్లు నారక్కపేట ఉపసర్పంచ్ సురబోయిన రాంబాబు తెలిపారు. నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామంలో కోతులు విపరీతంగా పెరిగిపోయి పంటలు, ఇల్లు, ఆస్తులను ధ్వంసం చేయడంతో గ్రామ పెద్దలు సమావేశమై పరిష్కారం కోసం చర్చించినట్లు తెలిపారు.
ఈసందర్భంగా ప్రజల సూచన మేరకు కొండెంగను గ్రామానికి తీసుకురావడం జరిగిందని రాంబాబు తెలిపారు. కొండెంగ ఉనికితో కోతులు భయపడి గ్రామానికి రాకుండా ఉంటాయని, దీంతో గ్రామ పంటలు సురక్షితమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఈ చర్యను ఆహ్వానించారు. కోతుల బెడద వల్ల వ్యవసాయ పంటలతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా భయాందోళన నెలకొన్నదని తెలిపారు. కొండెంగను గ్రామ పరిధిలో ఉంచడం వల్ల సహజసిద్ధమైన పద్ధతిలో సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. స్థానిక పంచాయతీ అధికారులు కూడా ఈ చర్యను పర్యావరణానికి అనుగుణంగా కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
