స‌జావుగా ప్రజాపాలన.. ప్రగతి బాట కార్యక్రమం

స‌జావుగా ప్రజాపాలన.. ప్రగతి బాట కార్యక్రమం

  • మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు హాట్ కామెంట్స్.

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రజాపాలన.. ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి బజారు రౌడీల మాట్లాడారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆరోపించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గురువారం కౌన్సిలర్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాస్కరరావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

నీ సంగతి నాకు తెలుసు..చంద్రబాబు కాళ్లు పట్టుకుంది ఎవరో అందరికి తెలుసన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను జాతిపిత కాదనడానికి సిగ్గుండాలన్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చిండకపోతే.. నువ్వు సీఎం అయ్యుండే వాడివా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తామంటే.. ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.

నేనెవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.ఎవరికి భయపడేది లేదన్నారు.మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసిందే తానన్నారు. 800 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. రెండేళ్లు కాంగ్రెస్ పాలనలో తట్టెడు మట్టి పోయలేదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply