వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : జన్మనిచ్చిన తండ్రి కేసీఆర్(KCR) చిటికన వేలు పట్టుకుని ఉద్యమాలు చేయడం నేర్చుకున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuṇṭla kavita) అన్నారు. అలాంటి తండ్రి బాటలో తాను పయనిస్తున్నానని చెప్పారు. నాన్న మీ చుట్టు ఉన్న వాళ్లు ఏమి చేస్తున్నారో ఒకసారి తెలుసుకోవాలని అన్నారు. తనకు ఎన్ని జన్మలుంటే నీలాంటి తండ్రి తనకు దొరుకుతారా? అంటూ మీ ఉద్యమ స్ఫూర్తిగా ముందుకు వెళుతున్నానని చెప్పారు. మీరు కోరే బంగారు తెలంగాణ సాధనకు ఒక భౌతిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ(Social Telangana) కూడా అవసరమని అన్నారు. తాను సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. తాను సామాజిక తెలంగాణ అంటే కొత్త పార్టీ పెడతానని దుష్ప్రచారం చేస్తున్నారు.
హరీశ్‌రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు
మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao), మాజీ ఎంపీ సంతోష్(Santosh) ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ సాధించినట్లు కాదని కవిత మండిపడ్డారు. సామాజిక తెలంగాణ లేకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని అన్నారు. హరీశ్‌రావు, సంతోష్ ఇద్దరూ కలసి బీఆర్ఎస్ పార్టీని, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం(breakdown) చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాను మీ లాగా ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి అని, అందుకే వాళ్లంత తనపై దుష్ర్పచారం(Bad publicity) చేస్తున్నారని అన్నారు. మీరు స్థాపించిన పార్టీ విచ్ఛిన్నం కాకుండా చూడాలని కోరారు.

