రేపే పరీక్ష.. సర్వం సిద్ధం…

వెల్దండ, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల సమీపంలోని గుండాల గ్రామపంచాయతీలో గల ఏకలవ్య మోడల్ పాఠశాలలో 5వ తరగతి 2026-27వ విద్యా సంవత్సరానికి ఆదివారం నిర్వహించే గురుకుల కామన్ ఎంట్రెన్స్ పరీక్ష కేంద్రాని సర్వం సిద్ధం చేసినట్లు ప్రిన్సిపల్ సుమన్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం11:00గంటల నుండి మధ్యాహ్నం 1:గంటల వరకు ఉంటుందని అన్నారు.
టీజీ సెట్ అధికారుల ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రంలో 10నిమిషాల ముందుగానే విద్యార్థులు ఉండాలని సూచించారు లేటుగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదని తెలిపారు.

Leave a Reply