మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

  • కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు
  • 8, రెండు, 13 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కాంగ్రెస్ స్టార్ క్యాంపియన్ రాజ్యసభ సభ్యులు సీనియర్ నాయకులు వీ హనుమంతరావు అన్నారు. గురువారం నాగర్కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త హాకీం మురళి స్వగృహంలోఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలోమున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక ఛైర్మన్ స్థానాలను సాధిస్తుంది అన్నారు.

ఆరు గ్యారంటీలలో మహిళలకు ఇచ్చే తులం బంగారు, 2వేల 500పింఛన్ తప్పితే అన్ని హామీలు అమలు చేశామన్నారు. ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు ఎన్నో తప్పులు చేసిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారన్నారు. అబ్ కీ బార్ కిసాన్‌సర్కార్ అని మహారాష్ట్రలో డబ్బులు పెట్టారు. రైతులకు సంకెళ్లు వేశారని అందుకే సోనియా, రాహుల్ ఆలోచనలను అమలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నన్నారు.

రాహుల్ గాంధీ స్పూర్తితో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. బీసీ నాయకుడిని ఎన్నుకోవడం శుభపరిణామం అన్నారు‌. బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిజర్వేషన్ల కోసం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే గవర్నర్ పెండింగ్‌లో పెట్టారన్నారు. బీజేపీ పనిలేని పార్టీ అని, జాతిపిత గాంధీని చంపిన పార్టీ అన్నారు. దేశాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తోంది అన్నారు. దేశంలో ముస్లిం, క్రిస్టియన్లను బయటకు వెళ్లగొట్టే కుట్రలు జరుగుతున్నాయి అన్నారు.

అది ఎప్పటికీ జరగదన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణను కేసీఆర్ విస్మరించారన్నారు. కేసీఆర్ రుణమాఫీ వల్ల లాభం కలగలేదన్నారు. తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ, ఫూచర్ సిటీలను నిర్మిస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డుల్లో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు.

అనంతరం ఎనిమిదో వార్డులో రెండు 13 వార్డులలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అభ్యర్థులు బాదం రమేష్ పొడుగు శ్రీనివాసులు కొత్త శ్రీనివాసులు లను గెలిపించాలని ఆయా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్కు ఓటేయాలని నాగర్ కర్నూల్ అభివృద్ధి చూసి కాంగ్రెస్ను ఆదరించాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సహకారంతో నాగర్ కర్నూల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తున్నదని హనుమంతరావు ఓటర్లకు తెలిపారు ఓటర్లతో కలిసి ఆడి పాడి మహిళలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు.

Leave a Reply