సీఎం సభకు ముస్తాబు
- ప్రజాప్రతినిధుల సండడే సండడి
దత్తిరాజేరు, (విజయనగరం) ఆంధ్రప్రభ : సామాజిక పెన్షన్ల పంపిణీ(Distribution of pensions)కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అక్టోబర్ 1న విజయనగరం జిల్లా దత్తి గ్రామాని(Datti Gramani)కి వస్తున్ననేపథ్యంలో.. కార్యక్రమ ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి(Gummadi Sandhyarani), చిన్న పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) పర్యటించారు.
దత్తి గ్రామంలో ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. హెలీపాడ్, సభ వేదికలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేసే ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం గ్రామ సచివాలయంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లును చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన(Baby Nayana), జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్ పాల్గొన్నారు.



