అన్ని రంగాల్లో రాణించాలి

  • ఇంచార్జ్ తహసిల్దార్ నేలపట్ల నరేష్, ఎంఈవో తల్లమల్ల మల్లేష్.

మునుగోడు, ఆంధ్రప్రభ : దివ్యాంగులు క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఇంచార్జ్ తహసీల్దార్ నేలపట్ల నరేష్, ఎంఈవో తల్లమల్ల మల్లేష్ లు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో దివ్యాంగులకు క్రిడాపోటీలు నిర్వహించారు.

పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకరి బిక్షం గౌడ్, స్పెషల్ ఎడికేటర్ ఉపేందర్, లక్ష్మీప్రసన్న, భవిత ఐ ఆర్పి ఇందిర, ఎమ్మార్సీ సిబ్బంది దివ్య, చంద్రమౌళి, సతీష్, నాగరాజు, విద్యార్ధుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply