భక్తిశ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు..

మద్దూర్, ఆంధ్రప్రభ : మద్దూర్, కొత్తపల్లి మండలాలలో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మండలం వ్యాప్తంగా ముస్తాబైన ఈద్గాలు, మసీదులు, ప్రత్యేక ప్రదేశాలకు నూతన వస్ర్తాలు ధరించి ఉదయమే చేరుకున్న ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు మండలాల్లో మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.
