Murder | ఇంటిముందే పాతిపెట్టి

Murder | ఇంటిముందే పాతిపెట్టి
Murder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో భార్య భర్తను హత్య చేసి ఇంటి ముందే పాతిపెట్టిన విషయం నాలుగు నెలల తర్వాత బయటపడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాతచెరువులో భార్య భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు నాలుగు నెలల క్రితం భర్త హనుమంతును భార్య సుకన్య హత్య చేసి, మృతదేహాన్ని తమ ఇంటి ముందే పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజాగా తల్లీ కూతుళ్ల మధ్య జరిగిన గొడవలో ఈ హత్య విషయం బయటపడింది. విషయం బయటకు రావడంతో నిందితురాలు సుకన్య అనంతపురం పోలీస్స్టేషన్లో లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసే ప్రక్రియ ప్రారంభించారు. అనంతరం పోస్టుమార్టమ్ కోసం తరలించనున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
