మంచిర్యాల, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే రజతోత్సవ సభకు సంబంధించి వేసిన వాల్ రైటింగ్ లపై మున్సిపల్ సిబ్బంది సున్నం వేయడంపై చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం నిరసనకు దిగారు. వాల్ రైటింగ్ లపై సున్నం వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

బాల్క సుమన్ ఖండన
బిఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి పెరుతున్న ఆదరణ చూడలేక ఇలా తమ వాల్ రైటింగ్స్ పై సున్నాలు వేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.. ఇటువంటి చర్యలు మానకుంటే ప్రజలు తగిన విధంగా బుద్దిచెబుతారన్నారు.. ఇది ఇలా ఉంటే బిఆర్ఎస్ పార్టీ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది.. ఇటువంటి చర్యలకు పాల్పడితే సహింబోమని హెచ్చరించింది.. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోడానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించింది.