Municipal Elections | వీచిన సానుభూతి పవనాలు..

Municipal Elections | వీచిన సానుభూతి పవనాలు..

  • 5 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అనురాధ విజయం..
  • కుర్చీ గుర్తుతో.. కౌన్సిలర్ కుర్చీ

Municipal Elections, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 5 వ వార్డులో గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి ఈసారి జనరల్ మహిళ కోటాలో స్వతంత్ర అభ్యర్థిగా (కుర్చీ) గుర్తుతో పోటీ చేసి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోక రేణుక బిక్షం పై 55 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఓడిపోయారు. ఇదే వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ మలిపెద్ది రజిత సైతం స్వతంత్ర అభ్యర్థిగా (ఆపిల్) గుర్తు పై పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీపీఐతో పొత్తులో భాగంగా మొగుళ్ళ స్వాతి శేఖర్ రెడ్డి పోటీ చేశారు.

ఈ వార్డులో బీఆర్ఎస్ కి 258 ఓట్లు రాగా, సీపీఐ అభ్యర్థి కి 257 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి రజితకు 179 ఓట్లు రాగా, అనురాధకి 313 ఓట్లు వచ్చాయి. 55 ఓట్ల మెజార్టీ సాధించడంతో ప్రధాన పార్టీల నాయకులు ఆవాక్కయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇరువురు ఆహ్వానించి పార్టీ టిక్కెట్ ఇస్తామన్నా తాము కాదనుకొని స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచామని, తమకు వార్డ్ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చి కౌన్సిలర్ పదవి ఇచ్చారని ప్రజల రుణం తీర్చుకుంటానని అనురాధ ఆంధ్రప్రభ ప్రతినిధితో తన భావాన్ని వ్యక్తీకరించారు.

కౌన్సిలర్ ‘ కుర్చీ ‘ ఎక్కిన స్వతంత్ర అభ్యర్థి

  • ప్రజా తీర్పుతో.. ప్రజాప్రతినిదిగా..
    మున్సిపాలిటీలో 5 వ వార్డ్ బుజిలాపురంకి చెందిన మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి మందీ మార్బలం లేదు.. తన వెంట ప్రధాన పార్టీల క్యాడర్ లేదు. పార్టీ సింబల్ అసలే లేదు. పోటీదారులతో పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం ఆశ చూపింది లేదు. కానీ స్థానిక ఓటర్లు మాత్రం గత కౌన్సిలర్ ఎన్నికల్లో కేవలం ఓడిపాయారని సానుభూతి చూపారు. పోటీదారులు ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసిన తన మొక్కవోని ధైర్యం తనకు అండగా నిలిచి విజయానికి బాసటగా నిలిచింది. స్థానిక ఓటర్లు సైతం రాజకీయ విశ్లేషకులకు అంతుచిక్కని రీతిలో ప్రధాన పార్టీల అభ్యర్డులను పక్కన బెట్టి ఒక స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టి ఏకంగా కౌన్సిలర్ కుర్చీ కట్టబెట్టడంతో ప్రజా తీర్పు ను ప్రతి ఒక్కరు శిరసావహిస్తున్నారు. ఇలా సమాజంలో ప్రతి ఓటర్ మంచి అభ్యర్థుల గెలుపు కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Leave a Reply