Municipal Chairman | రంగంలోకి ముగ్గురు నాయకులు

Municipal Chairman | రంగంలోకి ముగ్గురు నాయకులు

  • ముమ్మరంగా ప్రచారం…

Municipal Chairman | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఛైర్మెన్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు ఒకరిని మించి మరొకరు ప్రయత్నాలు చేస్తున్నారు.. అంతే కాకుండా ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు..దీంతో ఓటర్లు ఎవరిని ఆశీర్వదీస్తారో ఎవరిని పీఠం ఎక్కిస్తారో అనే ఉత్కంఠ సాగుతున్నది. ప్రదానరాజకీయ పార్టీలకు చెందిన మంత్రి వివేక్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో వైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ప్రచారం చేపడుతుండటంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి..ముగ్గురు నేతలు ఇంటింటి ప్రచారం చేపడుతూ ఓటర్లతో నేరుగా మమేకమవుతూ అన్ని వార్డుల్లో పార్టీ వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు.కీలకంగా ఉన్న ముగ్గురు నేతలు ప్రత్యక్షంగా రంగంలో దిగి ఎవరికి వారే పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇది ఉత్కంఠ కు దారి తీస్తున్నది..మరో వైపు ఓటర్లు ఎటు మొగ్గుతారో అనేది కూడా రాజకీయ విశ్లేషకులకు అంతు చిక్కకుండా ఉంది. .ఒకరు మంత్రి కావడం, మరొకరు మాజీ ఎమ్మెల్యే కావడం, ఇంకొకరో పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావడం , ముగ్గురు చెన్నూరు ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రోజు రోజుకు రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి.

ప్రచారం కీలక దశలోకి చేరగా.. ఓటర్లు మాత్రం అందరికీ ఓట్లు వేస్తానని చెపుతుండటం..తుది ఫలితం ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది.ముగ్గురు నేతల ప్రచారంతో చెన్నూరు ఎన్నికలు రాష్ట్ర స్థాయిని ఆకర్షిస్తున్నాయి.అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, మరోవైపు బీజేపీ ల పోటాపోటీ ప్రచారంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారగా ఓటరు దేవుడు ఎవరిని ముంచుతాడో, ఎవరిని ఆశీర్వదిస్తాడో ఎన్నికల ఫలితాలవరకు వేచించుడాల్సిందే.

Leave a Reply