Mulugu | నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి

Mulugu | నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి

రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ అనిత


Mulugu | ములుగు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తూ నామినేషన్ల ప్రక్రియ (nomination process) ను ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ అనిత (Anitha) పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని సింగన్న గూడ, చిన్న తిమ్మాపూర్ క్లస్టర్లలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతో మర్యాదగా ప్రవర్తిస్తూ నామినేషన్లు స్వీకరించాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త (Becareful) గా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మేరీ స్వర్ణలత పాల్గొన్నారు.

Leave a Reply