Mulugu | ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి సీత‌క్క శంకుస్థాప‌న‌

ములుగు – ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses ) నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీత‌క్క (Minister Seetakka ) ఆదేశించారు. పేద ప్రజల కలల్ని నిజం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ములుగు జిల్లా (Mulugu District ) కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం ఆమె అదనపు కలెక్టర్ సంపత్ రావు (additional Collector sampatrao ) తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన (Laying foundation stone ) చేశారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి గృహ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆడబిడ్డలు, పేద కుటుంబాల భవిష్యత్తు కోసం ఈ పథకం ప్రారంభించాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం,” అని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు నమ్మకాన్ని ఉంచాలని సూచించారు.

Leave a Reply