Mulugu | లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో.. మంత్రి సీతక్క

Mulugu | లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో.. మంత్రి సీతక్క

Mulugu | ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క) దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సీతక్కకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్. మహేష్ , ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవన కుమారాచార్యులు, ఈశ్వర్ చంద్ శర్మ తదితరులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామి వారికి సీతక్క కుటుంబ సభ్యుల గోత్రనామాలతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందించి ఆశ్వీరవచనం చేశారు. అనంతరం మల్లూరు గ్రామంలోని రామాలయం వద్ద శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మంత్రి సీతక్క బహుమతులు అందజేశారు.

Mulugu

Leave a Reply