పదవీ భాద్యతలు చేపట్టిన ఎంసీపల్లి నూతన పాలకవర్గం

పదవీ భాద్యతలు చేపట్టిన ఎంసీపల్లి నూతన పాలకవర్గం

మూడు చింతలపల్లి, ఫిబ్రవరి 20 (ఆంధ్రప్రభ) : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవంలో చైర్మన్ గా జాము రవి, వైస్ ఛైర్ పర్సన్ గా శశిరేఖ లతో పాటు కౌన్సిలర్లు శనివారం పదవి భాద్యతలు చేపట్టారు. మూడు చింతలపల్లి మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి అధికారులు సన్మానించి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈసందర్భంగా చైర్మన్ జాము రవి మాట్లాడుతూ… మున్సిపల్ అభివృద్ధి కి పాలకవర్గంతో కలిసి కృషి చేస్తానని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధి కొరకై పార్టీలకు అతీతంగా కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాపి రెడ్డి, ప్రియాంక, శ్రీవాణి, సరిత, నీరజ్ గౌడ్, నవీన్ నాయక్, లత, శ్రీలత, గోవర్ధన్ రెడ్డి, రాజు, మౌనిక, విష్ణువర్ధన్ రెడ్డి, జంగా రెడ్డి, స్వప్న, మహేశ్వరి, జ్యోతి, రమేష్, మల్లేష్, లత, అజయ్ కుమార్, ప్రభాకర్, మాధవి, అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply