Mudhole | ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Mudhole | ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బోస్లీ నారాయణ రావు పాటిల్

Mudhole | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బోస్లీ నారాయణ రావు పాటిల్ పేర్కొన్నారు. ఇవాళ‌ భైంసా కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముధోల్ మండలం ఆష్టా గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ముధోల్ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి సమక్షంలో పంపిణీ చేశారు.

ఆష్టా గ్రామానికి చెందిన ఇంటెంక పోతన్నరూ.31,500, దొమ్మనోళ్ల ముత్యం రూ.22,000, ఆకుల రవిలత రూ.12,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా భోస్లే నారాయణ రావు పాటిల్ మాట్లాడుతూ… ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వైద్య చికిత్సల కోసం ఇబ్బంది పడకూడదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ నిధులను త్వరితగతిన విడుదల చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈకార్యక్రమంలో ముధోల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గంగారెడ్డి, ఆష్ట గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్రే, ఆత్మ చైర్మన్ గన్ను నర్సారెడ్డి, సీనియర్ నాయకులు బంక బాబు, లోలం మురళి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply