Mudhol | 24గంటలూ.. ప్రజా సేవ చేస్తా

Mudhol | 24గంటలూ.. ప్రజా సేవ చేస్తా
- ముధోల్ గ్రామ సర్పంచ్ కోరి అనిత పోతన్న
Mudhol | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ గ్రామాభివృద్ధి జరగాలంటే ఈనెల 17న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని గ్రామాల్లోని వీధుల్లో ఇంటింట తిరుగుతూ ఇవాళ విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలను తాను సర్పంచ్ పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే అన్ని సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చా రు.
ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యతను ఇస్తానని హామీ ఆమె హామీ ఇచ్చారు. అన్నివెలలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి గ్రామంలో విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాల్లోని మౌలిక వసతులు కల్పనకు దశలవారీగా కృషి చేస్తారని అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని, అన్నివేళలా గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కారం చూపి దోహదపడతానని పేర్కొన్నారు. ఆమెతో పాటు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.
