MPTC,ZPTC ఎన్నికలపై కసరత్తు

MPTC,ZPTC ఎన్నికలపై కసరత్తు
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః తెలంగాణ ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ యాక్షన్ ప్లాన్ తయారీకి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటిని సీఎం రేవంత్ రెడ్డి సభ్యులుగా నియమించారు. కన్వీనర్ గా ప్లానింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీని నియామకం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సబ్ కమిటీ క్షేత్రస్థాయిలో వెళ్లి నివేదిక తయారు చేయనుంది.
