ఉమ్మడి మెదక్ బ్యూరో : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు కుటుంబం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మోడీని ఎంపీ రఘునందన్ రావు శాలువాతో సత్కరించి పూలబోకే సమర్పించారు. అనంతరం మోడీకి రఘునందన్ రావు తన కుటుంబాన్ని పరిచయం చేశారు.
మోడీకి రఘునందన్ రావు కుమార్తె స్వీట్స్ తినిపించగా, ఆసక్తిగా స్వీట్స్ స్వీకరించి చిన్నారులకు ప్రధాని మోడీ ఆశీస్సులు అందించారు.. ఈసందర్భంగా రఘునందన్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.