Mp mla l వైసీపీ వాళ్ళ అవినీతికి తిరుపతి లడ్డూ ప్రసాదమే దొరికిందా?

Mp mla l వైసీపీ వాళ్ళ అవినీతికి తిరుపతి లడ్డూ ప్రసాదమే దొరికిందా?
వక్కలగడ్డలో కమ్యూనిటీ హాలు ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
Mp mla l చల్లపల్లి ,ఆంధ్రప్రభః వైసీపీ నేతలు అవినీతికి పాల్పడేందుకు తిరుపతి లడ్డూ ప్రసాదమే దొరికిందా? అని మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డ దొరవానిగూడెంలో ఎంపీ బాలశౌరి మంజూరు చేసిన ఎన్.టీ.పీ.సీ సీఎస్ఆర్ నిధులు రూ.25లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాలును ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి ప్రారంభించారు.
ఇప్పటికి రూ.50కోట్ల సీఎస్ఆర్ నిధులు తెచ్చి కమ్యూనిటీ భవనాలు, వంతెనలు నిర్మించామని, మరో రూ.50కోట్ల సీఎస్ఆర్ నిధులు తెచ్చి మరిన్ని పనులు చేస్తామని ఎంపీ బాలశౌరి అన్నారు . రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి తెచ్చిన సాస్కి నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. డొంక రోడ్ల అభివృద్ధిపై కూడా డిప్యూటీ సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి బందరు పోర్ట్ నిర్మిస్తున్నామని, మచిలీపట్టణం- రేపల్లె రైల్వే లైన్ కూడా త్వరలో సాకారం కానుందని తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా రూ.574 కోట్లతో ఆరు లైన్ల రోడ్ నిర్మిస్తామన్నారు.
లడ్డు ప్రసాదం అంశంపై బాలశౌరి మాట్లాడుతూ పవిత్రమైన లడ్డును రసాయన భరిత ప్రమాదకర కల్తీ నెయ్యితో తయారు చేసి తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేయటమే కాకుండా తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వైసీపీ నాయకులు ఇంకా బుకాయించటం సిగ్గుచేటు అన్నారు. కెమికల్స్ అమ్మిన వారు వైసీపీ నేతల ఖాతాలకు డబ్బు ఎందుకు పంపారని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వైసీపీ బుకాయింపునకు అనుగుణంగా కల్తీ జరగలేదని ఒక్క ఆధారం అయినా ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. జనసేన కార్యకర్తలు వైసిపి మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వక్కలగడ్డ గ్రామంలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఇచ్చిన రూ.33లక్షలతో నాలుగు సీసీ రోడ్లు నిర్మించామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ అనేక సీసీ రోడ్లు నిర్మించామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ – గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకోవడం గ్రామీణ ప్రాంత అభివృద్ధికి వరంగా నిలుస్తోందన్నారు. మరిన్ని రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. బందర్ పోర్టు నిర్మాణం, రైల్వే లైను ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎంపీ బాలశౌరి తెస్తున్న సీఎస్ఆర్ నిధులతో లాభాపేక్ష లేకుండా చక్కని భవనాలు నిర్మిస్తున్న రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ నిర్వాహకులు జీ.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, టీడీపీ మండల అధ్యక్షులు, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, జనసేన పార్టీ చల్లపల్లి, మోపిదేవి మండలాల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, పూషడపు రత్నగోపాల్, బీజేపీ మండల అధ్యక్షులు అడపా రవి, సర్పంచులు వల్లూరు ఉమా, కొల్లూరి కోటేశ్వరరావు, పైడిపాముల కృష్ణకుమారి, డొక్కు నాగేశ్వరరావు, ఎంపీటీసీలు మట్టా కోమలి, సిద్దినేని కుమార్ రాజా, మేకా బంగారుబాబు, పీఏసీఎస్ చైర్మన్లు బొందలపాటి వీరబాబు, తిరుమలశెట్టి బాల నాగేశ్వరరావు, డీసీ వైస్ చైర్మన్ పరిసే చలపతి, మాజీ సొసైటీ చైర్మన్ హనుమానుల బెనర్జీ, విశ్రాంత ఈఓఆర్డీ దాసి సీతారామరాజు, లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, కూటమి నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు, మోర్ల శివ, కోసూరు శివాజీ, యడ్లపల్లి బుజ్జి, సూదాని నందగోపాల్, తోట మురళీకృష్ణ, అనుమకొండ పూర్ణ చంద్రశేఖరరావు, మట్టా చిన్నా, కోనేరు శ్రీనివాసరావు, రేపల్లె రవీంద్ర, సుగ్గన పవన్ కుమార్, మహమ్మద్ హఫీజుర్ రెహమాన్ (ఏసీ బాబు), తాడికొండ సాయితేజ, మత్తి మురళీకృష్ణ, బుల్లా కిషోర్, షేక్ నబీఘోరీ, గొరిపర్తి సుబ్బారావు, షేక్ నసీంఘోరీ, పెనుమత్స కృష్ణ, నల్లమోతు వీరయ్య, మేడికొండ రవిబాబు, మెరకనపల్లి నరేష్, మిరియాల జితేంద్ర, రాయవరపు నాంచారయ్య, రావి రాజు, యార్ల శ్రీకాంత్, గోళ్ళ ప్రసాద్, తుమ్మల నందీశ్వరరావు, గోవాడ రాము, కూనసాని పరమేశ్వరరావు, మడమల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
