MP | మండల అభివృద్ధికి సహకరించండి

MP | మండల అభివృద్ధికి సహకరించండి
- ఎంపీ బలరాం నాయక్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
MP | వాజేడు, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు ఎంపీ బలరాం నాయక్(MP Balaram Naik)ను వాజేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దంతులూరి విశ్వనాధ ప్రసాదరాజు, నల్లగాసి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాజేడు మండలంలోని పేరూరు, ధర్మవరం అయ్యవారిపేట(Dharmavaram Ayyavaripet) గ్రామాల్లోనే రైతు పొలాలకు వెళ్లుటకు రోడ్లు మంజూరు చేయాలని, మండల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఆయా ప్రాంతాల్లోని రైతులు రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వం రైతుల గురించి ఏనాడు పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వంలోనైనా వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ.. తమ వంతు సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
