NZB | ఢిల్లీలో విజయంపై ఎంపీ అరవింద్ హర్షం
నిజామాబాద్ ప్రతినిధి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ) : ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్కేపురం, జంగ్ పుర నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్వీందర్ సింగ్ ల తరపున రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిగా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచార బాధ్యతలు చేపట్టారు.
ఆ రెండు నియోజకవర్గాల్లో శనివారం బీజేపీ విజయం సాధించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్వీందర్ లను ఢిల్లీలో ఎంపీ ధర్మపురి అరవింద్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ విజయం ప్రధాని మోడీకే అంకితమని ధర్మపురి అరవింద్ తెలిపారు.