వాల్మీకి దేవాలయంలో ప్రత్యేక పూజలు
హిందూపురం, అక్టోబర్ 8 (ఆంధ్రప్రభ) : సత్యసాయి జిల్లా (Sathya Sai District) హిందూపురంలో వాల్మీకి దేవాలయంలో అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి కళ్యాణ మంటప అధ్యక్షులుగా ఉంటూ రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా హిందూపురం (Hindupuram) లో కళ్యాణమండపం నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగానే అనంతపురం నుండి ఉదయం హిందూపురం వాల్మీకి సంఘానికి చేరుకొని అక్కడ వాల్మీకులతో సమావేశమయ్యారు.
ఈసందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వాల్మీకుల అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఎస్టీ జాబితా విషయం గురించి చర్చించారు. వాల్మీకులు ఎస్టీ జాబితా (ST list) విషయంపై తన వంతుగా పోరాటం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయంతో ఢిల్లీలో తమవంతుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
వాల్మీకి సోదరులందరూ ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలని, అప్పుడే ఏమైనా సాధించవచ్చని ఈ సందర్భంగా వాల్మీకి సోదరులకు ఆయన తెలిపారు. అనంతరం వాల్మీకి సంఘం (Valmiki Sangam) అధ్యక్షులు వెంకటరమణ, గౌరవాధ్యక్షులు ఆదినారాయణ ఆకుల సూరి, లోకేష్, నరసింహమూర్తి, తదితరులు అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు తదితరులు పాల్గొన్నారు.