Motkur | క్యాలెండర్ ఆవిష్కరణ..

Motkur | క్యాలెండర్ ఆవిష్కరణ..
Motkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శ్రీ సీతారాముల ఆలయంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు పురుగుల వెంకన్న, అధ్యక్షుడు బత్తిని శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి పయ్యాముల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొంతం సత్తయ్య, కోశాధికారి ఏల నాగేష్, సహాయ కార్యదర్శి గొడిశాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి బొడ్డుపెళ్లి సతీష్, సభ్యులు కనుకు సత్యం, వాసం ప్రసాద్, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, తాడూరు నరేందర్, జంగ సతీష్, శాఖ పురం అనిల్ కుమార్, కట్టెకోల మహేష్, వడకాల యాదగిరి , బుర్ర శివ మల్లేష్, గురు స్వాములు రామలింగం ప్రదీప్ శర్మ, జంగ నరసయ్య తదితర స్వాములు పాల్గొన్నారు.
