Mothkur | మున్సిపాలిటీకి 7 లక్షల 92 వేల ఆదాయం..

Mothkur | మున్సిపాలిటీకి 7 లక్షల 92 వేల ఆదాయం..

Mothkur, ఆంధ్ర ప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోత్కూర్ మున్సిపాలిటీకి గత 3 రోజులుగా నామినేషన్ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆయా పార్టీల స్వతంత్ర అభ్యర్థుల నుండి ఆస్తి పన్ను రూపేణా 7 లక్షల 92 వేల ఆదాయం సమకూరినట్లు మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్, మేనేజర్ ప్రభాకర్ లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితోపాటు, ప్రపోజర్ కూడా ఇంటి పన్ను, ఇతర బకాయిలు పూర్తిగా చెల్లించాలని ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఉండడంతో మోత్కూర్ మున్సిపాలిటీకి భారీగా ఆదాయం చేకూరింది. ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఓ కౌంటర్ ను ఏర్పాటు చేసి మున్సిపల్ సిబ్బంది సేవలు అందించారు.

Leave a Reply