Mothkur | ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు

Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం 9వ వార్డు పరిధిలోని కొండాపురం 20వ పోలింగ్ బూత్ లో జామ చెట్ల బావి గ్రామానికి చెందిన బీసు రంగమ్మ (100) శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్ చైర్ లో ఆ వృద్ధురాలిని వాలంటీర్ల సహకారంతో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించారు. శతాధిక వృద్ధురాలు ఓటు వేయడంతో రిటర్నింగ్ అధికారులు, పోలీసులు, ఎన్నికల సిబ్బంది సిబ్బంది సైతం ఆమెతో కలిసి ఫోటో దిగారు.ప్రజా స్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని ,ఈ వయస్సు లో తాను ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు.

Leave a Reply