అమ్మఒడి ఆశ్రమంలో వృద్ధులకు బట్టల పంపిణీ

అమ్మఒడి ఆశ్రమంలో వృద్ధులకు బట్టల పంపిణీ

చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరులోని అమ్మ ఒడి అనాధాశ్రమంలో వృద్ధులైన అవ్వలు, తాతలకు బట్టల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం నిర్వహించారు. ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు జన్నావుల సురేంద్ర ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న సుమారు 70 మంది వృద్ధులకు చీరలు, టవల్స్‌ను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో అమ్మ ఒడి ట్రస్ట్ చైర్మన్ పద్మనాభ నాయుడు పాల్గొని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ కమిటీ సభ్యులు వెంకటరమణ, రెడ్డప్ప, జైచంద్ర, చిట్టిబాబు, శంకర్ నాయుడు, వేణుగోపాల్ నాయుడు, పవన్ కుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమంలోని వృద్ధులు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply