తల్లీకొడుకు ఆత్మహత్య

  • అప్పు తీర్చలేక ఒకరు..
  • మధ్యవర్తి ఆత్మహత్యకు యత్నం
  • రెండు కుటుంబాల్లో విషాదం

పల్నాడు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, సత్తెనపల్లి(Sattenapalli) మండలం, ఫణిదం గ్రామంలో బుధవారం పెను విషాదం చోటు చేసుకుంది. రుణం భారంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా… రుణ బంధాన్నితట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్య(suicide) యత్నించగా.. ఇద్దరు మరణించారు, ఇద్దరు చావు బతుకుల్లో కొట్టిమిట్టాడుతు(beating)న్నారు.

రుణ రక్కసికి చిక్కిన రెండు కుటుంబాలు ఛిద్రమైన తీరుతో సభ్య సమాజం చలించిపోయింది. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫణిదం గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు, రామనాథ శ్రీనివాసరావు(Ramanatha Srinivasa Rao) స్నేహితులు. శ్రీనివాసరావు మధ్యవర్తిత్వంతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో వెంకటేశ్వర్లు రూ. 90 వేలు రుణం తీసుకున్నాడు.

కిస్తీల చెల్లింపులో వెంకటేశ్వర్లు బకాయి పడటంతో ఫైనాన్స్(finance) కంపెనీకి కలెక్షన్ ఏజెంట్లు మంగళవారం సాయంత్రం శ్రీనివాసరావు ఇంటికి వచ్చారు. వెంకటేశ్వర్లు తీసుకున్నరుణాన్నిమధ్య వర్తిత్వం(finance, middleman) వహించిన శ్రీనివాస రావు, అతని భార్య పూర్ణిమ కుమారి చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో ఈ విషయంపై వెంకటేశ్వర్లను శ్రీనివాసరావు నిలదీశారు.

ఈ క్రమంలో స్నేహితుల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళి పోయారు. అనుకోకుండా మంగళవారం(Tuesday) రాత్రి వెంకటేశ్వర్లు తనకు అవమానం జరిగిందని భావించి పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు ఆయనను హడావుడి(hustle)గా సత్తెనపల్లి ఆస్పత్రికి తీసుకురాగా… అనంతరం గుంటూరుకు తరలించారు.

వెంకటేశ్వర్లు ఆత్మత్యకు యత్నించిన సమాచారంతో శ్రీనివాసరావు ఇంట్లో తెలిసి గొడవ మొదలైంది. భార్య పూర్ణిమ(wife Poornima) కుమారి, కుమారుడు వెంకటేశ్వర్లు మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. ఇక వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తమపై కేసు పెడతారేమోనని భయపడి శ్రీనివాసరావు బుధవారం ఉదయం పొలానికి వెళ్లి(went to the farm) పురుగుమందు తాగాడు. ఈ విషయం తన భార్య, కుమారుడికి తెలియజేశాడు.

అది జీర్ణించుకోలేని శ్రీనివాసరావు భార్య పూర్ణిమ కుమారి(45), కుమారుడు వెంకటేశ్వర్లు (23), సమీప పొలంలోని దిగుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు శ్రీనివాసరావు సత్తెనపల్లి(Sattenapalli) ప్రైవేటు వైద్యశాల తరలించారు. ఈ సమాచారం అందుకున్నసత్తెనపల్లి రూరల్ సీఐ ఎం.వీ. సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని శవాలను వెలికి తీశారు. రెండు వైపులా విచారణ జరిపి, కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply