MOTHER | మూడో అంతస్తు నుంచి…

MOTHER | మూడో అంతస్తు నుంచి…

  • చిన్నారిని తోసేసిన తల్లి

MOTHER | మల్కాజిగిరి, ఆంధ్రప్రభ : మల్కాజిగిరిలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి చేతిలోనే ఓ పసికందు ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని వసంతపురి కాలనీలో మోనాలిసా అనే మహిళ తన ఏడేళ్ల కుమార్తె షారోన్ మేరీని మూడో అంతస్తు భవనం పైనుంచి కిందకు తోసివేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన చిన్నారిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మోనాలిసాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.

Leave a Reply