Moon | చంద్రుడిపై నివాసం..! ఎప్పటికి సాధ్యం..?

Moon | చంద్రుడిపై నివాసం..! ఎప్పటికి సాధ్యం..?

ఔను.. తాజా అధ్యయనాల ప్రకారం.. చంద్రుడిని భూమి సాకుతోందనే చెప్పాలి. భూమి నుంచి ధూళి కణాలు.. చిన్న చిన్న శకలాలు చంద్రుడిని నిరంతరం చేరుతున్నాయని, ఇది లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతోందని తాజా అధ్యయనం(A recent study) తేల్చింది. చంద్రుడిపై జీవరాశి మనుగడ లేదని, అలాంటి వాతావరణం లేదని తెలుసు. కానీ తాజా అధ్యయనం ప్రకారం భూమి నుంచి చంద్రుడి పైకి చేరుతున్న మట్టి కణాలు ఖనిజ లవణాల ధూళి, శకలాలు, లక్షల సంవత్సరాల తరువాతైనా జీవరాశి మనుగడకు(For the survival of life) అనువైన వాతావరణం అంటే, భూమి పైన ఉన్న పరిస్థితులు చంద్రుడి పైనా సృష్టిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడి వాతావరణాన్ని, ఉపరితలం చంద్ర.. చంద్రధూళి సారవంతంగా మార్చడానికి ఈ పరిణామం ఉపయోగ పడుతోందని తేలింది.

Moon | భూధూళి చంద్రుడిపైకి చేరడానికి

Moon

భూ అయస్కాంత క్షేత్రాల(Geomagnetic fields) వల్ల ఇలా జరుగుతోందన్నది అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితులు లక్షల ఏళ్లపాటు కొనసాగితే, చంద్రుడిపై మానవుడు మనుగడ సాగించే వాతావరణం నెలకొనవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ రోచెస్టర్(University of Rochester) కు చెందిన శాస్త్రవేత్తలు కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సైన్స్ డెయిలీ)లో ప్రచురించారు. భూధూళి చంద్రుడిపైకి చేరడానికి భూవాతావరణం తోడ్పడుతోందని, అడ్డుకోవడం లేదని తేల్చారు. చంద్రుడి పైనుంచి తీసుకువచ్చిన మట్టిలోని భూధూళి కణాలకు సంబంధించిన డేటా, భూ వాతావరణంతో సౌర గాలులు(Solar winds) ఎలా సంపర్కం చెందుతాయి వంటి అంశాల సమాచారాన్ని క్రోడీకరించి భూవాతావరణం, భూ అయస్కాంత క్షేత్రాల పుట్టుక, చరిత్ర, వయసును అంచనావేస్తున్నామని.. ఈ అధ్యయనా నికి నేతృత్వం వహిస్తున్న ప్రొ.ఎరిక్ బ్లాక్మాన్ తెలిపారు.

Moon | భారీ మొత్తంలో భూమి నుంచి

Moon

ఆయన యూనివ ర్శిటీ ఆఫ్ రోచెస్టర్ లాబరేటరీ ఫర్ లేజర్ ఎనర్జిటిక్స్ విభాగంలో సైంటి స్ట్గా పనిచేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. భూమికి సంబంధించిన ప్రాచీన భాండాగారంగా చంద్రుడు(The Moon as an Ancient Repository) తయారయ్యాడని ఆయన అంటున్నారు. 1970లో (అపోలో మిషన్స్) చంద్రుడి నుంచి తీసుకు వచ్చిన చంద్రశిలలు, మట్టిని పరిశీలిస్తే.. నీరు, కార్బన్ డై యాక్సైడ్, హీలియం, అర్గాన్, నైట్రోజన్ ఉన్నట్లు తేలింది. అయితే సౌరగాలుల ద్వారా వీటిలో చాలా మటుకు చంద్రుడిపైకి చేరి ఉండొచ్చు. కానీ నైట్రోజన్ మాత్రం సౌరగాలుల ద్వారా మాత్రమే వచ్చి ఉండకపోవచ్చు. భారీ మొత్తంలో భూమి నుంచి చేరి ఉండొచ్చన్నది అంచనా. భూమిపై అయస్కాంత క్షేత్రాలు ఏర్పడక ముందే చంద్రుడిపై ఈ ధూళి కణాలు(Dust particles) చేరాయని ఇంతకాలం సిద్ధాంతీకరించారు. కానీ తాజా అధ్యయనం కొత్త విషయాన్ని చెబుతోంది.

CLICK HERE TO READ తగ్గేదేలే అంటున్న కొలంబియా

CLICK HERE TO READ MORE

Leave a Reply