రైతులకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షణ చేయాలి

రైతులకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షణ చేయాలి
- విప్ వేముల వీరేశం
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల పట్టణ మార్కెట్ యార్డులో రూ.1.65 కోట్లు (ఒక కోటి అరవై ఐదు లక్షలు) వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మార్కెట్‌లో రూ.1 కోటి వ్యయంతో మార్కెట్ కార్యాలయ భవనం నిర్మాణం, రూ.65 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు చిట్యాల మండలంలోని 11 గ్రామాలు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉండగా, ప్రస్తుతం ఆ గ్రామాలను చిట్యాల మార్కెట్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు.
చిట్యాల మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో ఎస్.పి. జయలక్ష్మి, మార్కెట్ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత-రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, నాయకులు పల్లపు బుద్ధుడు, జనగామ రవీందర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
