ఏసీబీ రైడ్స్
కిటికీలోనుంచి డబ్బుల వర్షం
ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
ఒంగోలు క్రైం, నవంబర్ 5 (ఆంధ్రప్రభ): ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (Ongole Sub-Registrar office) కిటికీలో నుంచి డబ్బులు వర్షం కురిసింది. బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. దాడుల సమాచారం అందుకున్న కొందరు సిబ్బంది భయంతో జేబుల్లో ఉన్న డబ్బును కిటికీల ద్వారా బయటకు విసిరేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తదుపరి తనిఖీల్లో (inspections) అధికారులు కార్యాలయ బాత్రూంలో దాచిన 10వేల రూపాయల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి మరికొంత డబ్బు స్వాధీనం చేసినట్లు సమాచారం.ఏసీబీ బృందం కార్యాలయ రికార్డులను పరిశీలించి అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి సారించింది. ఇటీవల ఈ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఆకస్మిక దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు సీజ్ చేసిన పత్రాలను విశ్లేషిస్తూ, కేసు వివరాలు సేకరిస్తున్నారు.

