ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు

చిట్యాల, ఆంధ్రప్రభ ; ఆనాటి కాలంలో మహిళల అభ్యుదయ భావాలు కలిగిన కవి మొల్లమాంబ అని, అక్షరాస్యతవైపు అడుగులు వేసిన గొప్ప మాతృమూర్తి అని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం అన్నారు.
శుక్రవారం మండలంలోని పెద్ద కపర్తి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నీలకంఠ నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి మొల్ల ముల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి సర్పంచ్ కాటం వెంకటేశం పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలోముద్దసాని రమణారెడ్డి,ఊటుకూరి రమేష్, నీలకంఠం విజయ,నరసింహ, బాలకృష్ణ,ఏర్పల యాదయ్య గంటల రవి,నూతి తిరుమలేష్,ఎరుపుల వెంకటేశం,ఈరటి మహేష్,గుండెబోయిన శంకర్,ఆశ కార్యకర్త అండాలు, కృష్ణ,భైరబోయిన యాదయ్య,బత్తుల సాయి,బైరబోయిన స్వామి,యాట వేణు, తదితరు పాల్గొన్నారు
