భారత ప్రధాన మంత్రి *నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు *వ్లాదిమిర్ పుతిన్ తో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. “నా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్‌తో చాలా మంచి, వివరణాత్మక సంభాషణ జరిగింది. ఆయనకు భారతదేశంలో ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా మోదీ, ఈ సంవత్సరం చివర్లో భార‌త్ లో జరగనున్న‌ 23వ భారత్-రష్యా వార్షిక సదస్సు కు రావాల‌ని పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత పెంచుతుందని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు.

ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ..

ఈ ఫోన్ సంభాషణలో పుతిన్, *ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలు, తన దృక్పథాన్ని మోదీతో పంచుకున్నారు. భారతదేశం, శాంతియుత పరిష్కారానికి కట్టుబడి ఉందని మోదీ మరోసారి స్పష్టం చేశారు. మోదీ–పుతిన్, భారత్-రష్యా మధ్య ఉన్న *ప్రత్యేక, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. గత సమావేశాల నుండి సాధించిన పురోగతిని కూడా సమీక్షించారు.

Leave a Reply