Modern | రజక వృత్తిదారుల సమస్యలపై దృష్టి సారించాలి

Modern | రజక వృత్తిదారుల సమస్యలపై దృష్టి సారించాలి
- జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు
Modern | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రజక వృత్తిదారుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం(State Govt) దృష్టి సారించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు డిమాండ్ చేశారు. ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు హాజరై మాట్లాడుతూ.. రజక వృత్తిదారుల(professional associations) సమస్యలపై ప్రభుత్వ దృష్టి సారించాలని కోరారు. రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని, వృత్తిదారులకు ఉచిత విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం కోరిన మేరకు అన్ని మున్సిపాలిటీల్లో మోడ్రన్(Modern) దోబీగాట్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ ప్రకారం జీవోను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రకటించిన మోడ్రన్ దోబీగాట్ల పథకం కింద అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Infrastructure) కార్పొరేషన్ ద్వారా 141 మున్సిపాలిటీల్లో రూ.2 కోట్ల వ్యయంతో దోబీగాట్లు నిర్మించేందుకు ప్రభుత్వం జీఓ ఆర్‌టి నెం.94ను విడుదల చేసిందని వివరించారు.
జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో దోబీగాట్లు ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే 50 సంవత్సరాలు పైబడిన రజక వృత్తిదారులకు పెన్షన్(Pension) అందించాలని, వృత్తిదారులకు మోపెడ్ వాహనాలు మంజూరు చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముష్కే చందర్, తోటపల్లి రమేష్, లావణ్య, శైలజ తదితరులు పాల్గొన్నారు.
