MLC victory | ఈ విజయం ప్రధాని మోదీకి అంకితం – బండి సంజయ్

కరీంనగర్ ఆంధ్రప్రభ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమరయ్యను గెలిపించి ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపట్ల నమ్మకంతోనే ఈ తీర్పు వెలువడిందన్నారు. ఈ తీర్పు టీచర్లకు, మోదీకే అంకితమన్నారు. సోమవారం రాత్రి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించి గెలుపు పత్రాన్ని అందుకున్న మల్క కొమరయ్య కు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూచారిత్రాత్మక తీర్పినిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలని, ఇది మామూలు విజయం కాదన్నాసురు. 5 వేల 900 ఓట్ల తేడాతో మల్క కొమరయ్య భారీ విజయం సాధించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపట్ల నమ్మకం, భరోసా ఉందన్నారు.

దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపట్ల నమ్మకంతో ఉన్నారని, ఇటీవల బడ్జెట్ లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు ఇవ్వడంపట్ల తీర్పు ఇచ్చారన్నారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెళ్లుమన్పించేలా ఈరోజు తీర్పు ఇచ్చారన్నారు. ఈ రోజు బీజేపీ కార్యకర్తల, నాయకుల కష్టం ఫలించిందని, వారి పూర్తి సమయాన్ని కొమరయ్య విజయం కోసం క్రుషి చేశారన్నారు. టీచర్ల సమస్యలపై పోరాడే సత్తా బీజేపీకి, కొమరయ్యకే ఉందని భావించి ఈ భారీ విజయం అందించారన్నారు.దురద్రుష్టమేమిటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉందని తెలిసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్కక్కై బీజేపీ అభ్యర్ధి కొమరయ్యను ఓడించాలని కుట్రలు చేశారన్నారు. ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేసినా వారి ఆటలను ఉపాధ్యాయులను సాగదీయలేదన్నారు.కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది మూడో విజయమని, ఆయన ఆధ్వర్యంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచామన్నారు. ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ గెలిచామని, రేపో ఎల్లుండో ప్రకటించబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుందన్నారు. రాబోయే రోజుల్లో రామరాజ్యం వస్తుందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని,. మేమే ప్రధాన ప్రతిపక్షమని విర్రవీగుతున్న బీఆర్ఎస్ కు చెంప చెళ్లుమనేలా తీర్పు ఇచ్చారన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అని,టీచర్ల సమస్యలపై పోరాడాల్సిన ఉపాధ్యాయ సంఘాలు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న తరుణంలో తపస్ మాత్రమే టీచర్ల సమస్యలపై పోరాడుతోందన్నారు. ఇది గమనించి మద్దతు తెలిపిన ఉపాధ్యాయులకు వందనాలు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరేదొక్కటేనని జాతీయవాదంతో ముందుకు సాగుతున్న తపస్ సంఘంలో టీచర్లంతా చేరాలని కోరుతున్నామన్నారు..బీసీ కులగణన పేరుతో ఒక వర్గానికే కొమ్ము కాస్తోందని, ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గ అభ్యర్ధిని ఉపసంహరించేలా చేసి మైనారిటీలందరినీ ఏకం చేసి బీజేపీ అభ్యర్ధిని ఓడించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు.

అనంతరం మల్క కొమరయ్య మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలు క్రుషి, తపస్ సహకారంవల్లే నేను ఎమ్మెల్సీగా గెలిచానన్నారు. నాపై నమ్మకం ఉంచి ఓటేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలని, 317 జీవోసహా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే నా ముందున్న ప్రధాన ఎజెండా అన్నారు. నా గెలుపుకు సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు నాయకులందరికీ క్రుతజ్ఝతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *