ఆంధ్ర ప్రభ, తూప్రాన్ : జూన్ రెండున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టొచ్చునని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. షర్మిల అక్క పార్టీ పెట్టి పాదయాత్ర చేసినట్లు కవిత కూడా జూన్ 2న పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తుందని ఎంపీ జోస్యం చెప్పారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని, ఇప్పుడు సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నారని ఆయన నిలదీశారు.
MDK | జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ : ఎంపీ రఘునందన్ రావు
