MLAs | ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్‌చీట్

MLAs | ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్‌చీట్
అనర్హత పిటీన్లను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
MLAs | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్యేలకు (MLAs) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చీట్ ఇచ్చారు. వారిపై వచ్చిన పార్టీ ఫిరాయింపు పిటీషన్‌ను కొట్టివేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు (ఎమ్మెల్యేల) కాంగ్రెస్ పార్టీలో చేరారని, పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జాప్యం కావడంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు (BRS and BJP parties) కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను సూచించింది. అయితే ఈ తీర్పు గడువు రేపటితో ముగియనుంది. ఇంతలోనే స్పీకర్ తన తీర్పు వెల్లడించారు.

తొలిదశలో ఐదుగురు ఎమ్మెల్యేల (Five MLAs) పిటిషన్లపై తీర్పు స్పీకర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ పార్టీ మారినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ప్రకటించారు. అందుకే ఈ పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పుతో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ కి ఊరటనిచ్చింది.

మొత్తం పది మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన పిటీషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) విచారణ చేపట్టారు. ఇద్దరు ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి కోరిక మేరకు వారి విచారణకు గడువు ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై స్పీకర్ తీర్పు ఇచ్చారు.



