మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల చెందిన మృతుల కుటుంబాలను మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తనారాయణరావు పరామర్శించారు. మండలంలోని నవాబుపేట, ముచినిపర్తి గ్రామాలకు చెందిన కసిరెడ్డీ రమ, దుగ్యాల స్వప్న, గుండపురెడ్డి నరసింహారావు లు మృతి చెందారు. దీంతో ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ మృతుల కుటుంబాలను పరామర్శించి, చిత్రపటాలకునివాళులర్పించారు. అనంతరం దుగ్యాల స్వప్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట గ్రామ సర్పంచ్ పర్లపల్లి రవి, మాజీ సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి, నాయకులు సర్వ శరత్, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
