ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు..

ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు..
- 30వవార్డులో…. ఆత్మీయ పలకరింపులతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
- కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు చెప్పిన…నూతన లబ్ధిదారులు
గుడివాడ, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజల మంచి కోసం ఆలోచించే సీఎం చంద్రబాబు వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణం 30వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ఉదయం పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటుగా పలువురు లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. నూతన పెన్షన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు.

సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేయడమే కాకుండా, వితంతు పెన్షన్లు ప్రక్రియను సులభతరం చేశారన్నారు. గొప్ప ఆలోచనలతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తూ…. అనేక మంచి పనులు చేస్తుందన్నారు. కార్యాలయాల్లో కూర్చొని చట్టాలు చేయడం కాదు…. ప్రజల మధ్య ఉంటూ….ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారిని ఆదుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు. గుడివాడ అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న మద్దతు చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, పండ్రాజు సాంబయ్య,చేకూరు జగన్ మోహన్ రావు, పోలాసి ఉమ, విశ్వనాథ్, కోడూరు ప్రభు,బుడబల్ల హరి,30వ వార్డు నాయకులు: రామిదేని వేణు, మజ్జాడ నాగరాజు, వంగపండు ఆదినారాయణ, దేవాది నాగేశ్వరరావు, పోలవరపు శ్రీనివాస్, పమిడి సుబ్రహ్మణ్యం, వెళ్లారి నరేంద్ర, తాటాకుల రాంబాబు,మారగాని లలిత కుమారి, పీరు సాహెబ్, టెక్కలి నాగరాజు, తాడేపల్లి శ్రీనివాస్,జనసేన నాయకులు సుభాషిని,సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
