ప్రభుత్వ విప్‌గా నియామకం..

ప్రభుత్వ విప్‌గా నియామకం..

  • ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఘన సన్మానం

చిట్యాల, ఆంధ్రప్రభ : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ విప్‌గా నియమితులైన సందర్భంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, వార్డు సభ్యుడు నాతి కిరణ్ కుమార్ గౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు నరసింహ, ఆరూరి శ్రీనివాస్, పంది నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply